Lion Kiran
-
గదిలో నిర్బంధించి.. తీవ్రంగా కొట్టి..
హైదరాబాద్: లెక్కల్లో తేడా వచ్చిందని తమ సంస్థ ఉద్యోగిని గదిలో నిర్బంధించి తీవ్రంగా కొట్టి హింసించాడనే ఆరోపణలపై సుచిరిండియా ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లయన్ కిరణ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..వరంగల్‌కు చెందిన బుస్సా ప్రియాంక్ సుచిరిండియాలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న సంస్థ జీఎం మధుసూదన్ అతడికి ఫోన్ చేసి కిరణ్‌ను కలవాలని చెప్పాడు. దీంతో ప్రియాంక్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లో ఉన్న లయన్ కిరణ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న కిరణ్ రూ.5 లక్షలు మోసం చేశావంటూ ప్రియాంక్‌పై దాడి చేయడమేగాక గదిలో నిర్భందించాడు. దీంతో అతను తనను కొడుతున్నారంటూ తన బంధువు ప్రమోద్‌కుమార్‌కు సమాచారం అందించడంతో ప్రమోద్ డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రియాంక్‌ను స్టేషన్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిరణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై దాడి చేయడమే కాకుండా ఈ విషయం పోలీసులకు చెప్పినా తనను ఏమీ చేయలేరంటూ కిరణ్ బెదిరించాడని, బలవంతంగా పోన్ పే ద్వారా కొంత డబ్బును తన ఖాతాకు మళ్లించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీడియా, పోలీసులను తప్పుదోవ పట్టించాడు తప్పుడు సమాచారంతో మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించిన తమ మాజీ ఉద్యోగి ప్రియాంక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సుచిరిండియా సంస్థ అధినేత లయన్ కిరణ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన సంస్థ వరంగల్ రిసార్ట్‌లో పని చేసే మాజీ ఉద్యోగి ప్రియాంక్ ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి బంజారాహిల్స్‌లోని తన ఇంటికి పిలిపించామన్నారు. అదే రిసార్ట్‌లో ఆపరేషనల్ హెడ్ పని చేసే అధికారిని ఈ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పామని అప్పటి వరకు తన ఇంట్లో ముందున్న ఆఫీస్ వద్ద ఉండమని చెప్పామన్నారు. అతను వస్తే తన బండారం బయటపడుతుందనే భయంతో బయటికి వెళ్లిన ప్రియాంక్ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని అక్కడితో ఆగకుండా తనను కిడ్నాప్ చేశామని, కొట్టామని మీడియాతో చెప్పాడన్నారు.అతను స్వయంగా రూ. 5 లక్షల ఫ్రాడ్ జరిగిందని అందరికీ చెబుతున్నాడని ఈ వ్యవహారంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
వరంగల్‌కు సుచిరిండియా!
హైదరాబాద్: ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరుల్లో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లను చేపట్టిన సుచిరిండియా తొలిసారిగా తెలంగాణ రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ పట్టణంలోకి అడుగుపెట్టనుంది. ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ ఏడాది ముగింపు నాటికి రూ.10 కోట్ల పెట్టుబడులతో వరంగల్‌లో అర్బన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ రిసార్ట్, మెగా షాపింగ్ మాల్ కం మల్టీప్లెక్స్ రెండు ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుచిరిండియా ఇన్ఫ్రాటెక్ ప్రై.లి. సీఈఓ లయన్ కిరణ్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తర్వాత వరంగలే ఆయువు పట్టు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్-వరంగల్ మార్గం పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మార్గంలో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లూ చేపడితే అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అందుకే వరంగల్ హైవేలోని యమ్నంపేటలో 8 ఎకరాల్లో సుచిర్ ఒడిస్సీ డ్యూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 99 డ్యూప్లెక్స్‌లొస్తాయి. 1,200 చ.అ. విల్లా రూ.36 లక్షలు, 1,500 చ.అ. అయితే రూ.40 లక్షలు. శంషాబాద్‌లో 25 ఎకరాల్లో టింబర్ లీఫ్ విల్లా ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. మొత్తం 123 విల్లాలు. 3,800 చ.అ. విల్లా ధర రూ.1.5 కోట్లుగా నిర్ణయించాం. ఈనెలాఖరులోగా తుమ్ముకుంటలో 100 ఎకరాల్లో ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో 25 శాతం ఓపెన్ ప్లాట్లు, 75 శాతంలో విల్లాలను నిర్మిస్తాం. 200 గజాల ప్లాట్ రూ.12 లక్షలు, 1,500 చ.అ. విల్లా ధర రూ.40 లక్షలు, 2,000 చ.అ. అయితే రూ.50 లక్షలు. వచ్చే నెలాఖరులోగా పుప్పాల్‌గూడలో 4.5 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. ఇందులో మొత్తం 220 ఫ్లాట్లొస్తాయి. 1,000 చ.అ. ఫ్లాట్ ధర రూ. 35-40 లక్షల మధ్య ఉంటుంది. గతేడాది రూ.65 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది రూ.100 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం.