'వాళ్లు దేశాన్ని లూటీ చేశారు' | venkaiah naidu takes on congress | Sakshi
Sakshi News home page

'వాళ్లు దేశాన్ని లూటీ చేశారు'

Aug 9 2015 12:40 PM | Updated on Sep 3 2017 7:07 AM

'వాళ్లు దేశాన్ని లూటీ చేశారు'

'వాళ్లు దేశాన్ని లూటీ చేశారు'

గడిచిన 10 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సజావుగా సాగనీయకుండా విపక్ష కాంగ్రెస్ పార్టీ దేశానికి నష్టం చేస్తున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. గడిచిన 10 ఏళ్లు దేశాన్ని పాలించిన ఆ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నదని, దీనికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నదన్నారు. జీఎస్టీ, ల్యాండ్ బిల్లులను అడ్డుకోవడంద్వారా కాంగ్రెస్ దేశ ప్రగతికి అడ్డుతగులుతున్నదని, వారిని ప్రజలు చీదరించుకుంటున్నారని వెంకయ్య చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement