పాపం ఎమ్మెల్యే... | TRS secondary of MLA | Sakshi
Sakshi News home page

పాపం ఎమ్మెల్యే...

Sep 27 2015 2:19 AM | Updated on Sep 3 2017 10:01 AM

పాపం ఎమ్మెల్యే...

పాపం ఎమ్మెల్యే...

పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది...నువ్వైతే ఎమ్మెల్యే అయిపోయావు...మా పరిస్థితి అర్థం...

పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది...నువ్వైతే ఎమ్మెల్యే అయిపోయావు... మా పరిస్థితి అర్థం అయితలేదని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నేత ఒకాయన ఎమ్మెల్యేపై నిష్టూరమాడుతున్నారు. పార్టీ విజయం కోసం కష్టపడ్డావు కాదనలేని సత్యం, అందుకే కదా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నీకే రిజర్వు చేసింది...ఆ పదవి నీకే రాసిపెట్టుకో అని ఎమ్మెల్యే ఊరడించారు.
 
 రేపు మాపూ అంటూ ఊరిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు అంటూ ప్రభుత్వం జీవో ఇచ్చేసరికి ఎమ్మెల్యేకు ముచ్చెమటలు...ఏం చేయాలో పాలుపోవడం లేదు. నియోజకవర్గంలో ముఖ్య నేతకు ఇస్తానని ఆశపెట్టిన పదవి ప్రభుత్వం ఎస్‌టీకి రిజర్వు చేసింది. భూతద్దం పెట్టి వెతికినా ఆ నియోజకవర్గంలో ఎస్‌టీ నేత కనిపించలేదు. తమకు పదవి వస్తే ఎక్కడ బలపడిపోతామో అని ఎస్‌టికి రిజర్వు అయ్యేలా ఎమ్మెల్యే పావులు కదిపారంటూ నియోజకవర్గం నేతలు మండిపడుతున్నారు...పాపం ఎమ్మెల్యే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement