బాగ్దాద్లో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి | Three killed in twin bomb blasts in Baghdad | Sakshi
Sakshi News home page

బాగ్దాద్లో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి

Nov 8 2013 7:19 PM | Updated on Sep 2 2017 12:25 AM

ఇరాక్ రాజధాని బాగ్దాద్లో శుక్రవారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు.

ఇరాక్ రాజధాని బాగ్దాద్లో శుక్రవారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న రెండు బాంబులు శుక్రవారం నాడు సఫారర్త్ జిల్లాలోని అలీ మసీదు సమీపంలో పేలాయి. పశ్చిమ బాగ్దాద్లోని ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉంటారని, పోలీసులు తెలిపారు.

శుక్రవారం నాడు ఇమాం అలీ మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సున్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ బాంబుదాడులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే దీని గురించిన మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇరాక్లో హింసాత్మక సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన సంఘటనలలో ఏడు వేల మంది ఇరాకీలు మరణించగా 16 వేల మందికి పైగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement