భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి | Student falls to death from building | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి

Published Mon, Aug 12 2013 3:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి - Sakshi

భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి

పుట్టినరోజు నాడే ఓ విద్యార్థిని మరణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విషాదాన్ని నింపింది. వర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడటంతో ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మోహినీ మిశ్రా(19) మృతి చెందింది.

హైదరాబాద్, న్యూస్‌లైన్: పుట్టినరోజు నాడే ఓ విద్యార్థిని మరణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విషాదాన్ని నింపింది. వర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడటంతో ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మోహినీ మిశ్రా(19) మృతి చెందింది. మోహినీ హెచ్‌సీయూలో ఎంఏ ఇంటిగ్రేటెడ్ భాషాశాస్త్రం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఆమె పుట్టినరోజు. దీంతో శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి సౌత్ క్యాంపస్ రోడ్డు పక్కనే ఉన్న బండపై కేక్ కట్ చేసింది.
 
 అనంతరం మోహినీ, మరో ఆరుగురు(ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు) 8వ హాస్టల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగవ అంతస్తులోకి వెళ్లారు. ‘అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్ రావడంతో మాట్లాడేందుకు మోహినీ పక్కకు వెళ్లింది. నాలుగైదు సార్లు తరచుగా ఫోన్ రావడంతో స్నేహితుల నుంచి దూరంగా వెళ్లి, మాట్లాడేందుకు ప్రయత్నించింది. బిల్డింగ్‌పై అంతస్తుకు పిట్టగోడ లేకపోవడం, చీకటిగా ఉండటంతో కాలుజారి కింద పడింది’ అని పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేలోపే మరణించింది.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 అనుమానాస్పదమేనా..
 మోహినీ, ఆమె మిత్రులు లైట్లు, సెక్యూరిటీ లేని భవనంలోకి వెళ్లడంపై పోలీ సులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమా? స్నేహితులతో ఘర్షణ పడిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో మోహినీతోపాటు ఉన్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పుట్టినరోజు సందర్భంగా తాము మద్యం తాగామని.. అయితే, మోహినీ, మరో విద్యార్థిని మాత్రం తాగలేదని వారు చెప్పినట్లు తెలిసింది.
 
 విద్యార్థుల ఆందోళన..
 నిర్మాణంలో ఉన్న భవనంపై పిట్టగోడ నిర్మించకపోవడం వల్లేమోహినీ మృతి చెందిందంటూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి వచ్చిన హెచ్‌సీయూ చీఫ్ ఇంజనీర్ సిద్ధార్థ వారితో వాగ్వాదానికి దిగారు. అసలు మీరు హెచ్‌సీయూ విద్యార్థులేనా.. మీ గుర్తింపు కార్డులను చూపించాలని  అడిగారు. దీంతో విద్యార్థులు సిద్ధార్ధపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాంటి అధికారుల అలసత్వం వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement