'బాధ్యులు ఎవరైనా వదిలేది లేదు' | Sakshi
Sakshi News home page

'బాధ్యులు ఎవరైనా వదిలేది లేదు'

Published Fri, Jul 31 2015 9:50 AM

'బాధ్యులు ఎవరైనా వదిలేది లేదు'

విజయవాడ: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులు ఎంతటి వారైనా వదలబోమని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేసిన మంత్రిని రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయ్ కలిశారు. తమ కుమార్తె మరణానికి కారణమై, తమకు తీవ్ర వేదన మిగిల్చిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రిని కోరారు.

' మా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రాకూడదు' అంటూ రిషితేశ్వరి తల్లిదండ్రులు మంత్రి వద్ద బోరున విలిపించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రిషితేశ్వరి ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నివేధిక ఆధారంగా బాధితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement