థియేటర్‌లో నటిని వేధించిన తాగుబోతు! | Priya Berde molested in a Mumbai theatre | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: థియేటర్‌లో నటిని వేధించిన తాగుబోతు!

Jul 18 2017 12:10 PM | Updated on Jul 23 2018 8:49 PM

థియేటర్‌లో నటిని వేధించిన తాగుబోతు! - Sakshi

థియేటర్‌లో నటిని వేధించిన తాగుబోతు!

ప్రముఖ నటికి థియేటర్‌లో షాకింగ్‌ అనుభవం ఎదురైంది.

ముంబై: ప్రముఖ మరాఠీ నటి ప్రియా బెర్డేకు థియేటర్‌లో షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఓ తాగుబోతు ఆమెను లైంగికంగా వేధించాడు. దివంగత నటుడు లక్ష్మికాంత్‌ బెర్డే సతీమణి అయిన ప్రియా బెర్డే తన కూతురిని తీసుకొని శనివారం సాయంత్రం థియేటర్‌కు వచ్చారు. ఆమె పక్క సీటులో కూర్చున్న ఓ వ్యక్తి తరచూ ఆమెను లైంగికంగా తాకడమే కాదు ఆ తర్వాత దాడి చేశారు. దీంతో నటి వెంటనే థియేటర్‌ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

పారిపోతున్న అతన్ని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రియా బెర్డే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు స్థానిక వ్యాపారి సునీల్‌ జాని (43)గా గుర్తించారు. అతడు తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు ధ్రువీకరించారు. కామెడీ పాత్రలు ప్రముఖంగా చేసే ప్రియాబెర్డే మరాఠీలో, బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement