breaking news
Mumbai theatre
-
'పుష్ప 2' థియేటర్లో స్ప్రే కలకలం
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి హైప్ నడుస్తోంది. బుకింగ్స్ కూడా మంచి జోరుగా సాగుతున్నాయి. అలాంటిది ముంబైలోని ఓ థియేటర్లో అనుకోని సంఘటన జరిగింది. దీంతో థియేటర్లో ఉన్నవాళ్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు)గురువారం రాత్రి ముంబైలోని బాంద్రా గెలక్సీలోని థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో స్ప్రే కలకలం సృష్టించింది. ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులు దగ్గుతో పాటు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో 15నిమిషాల పాటు మూవీని ఆపేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెప్పర్ స్ప్రేతో ఎటాక్ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరి ఇది ఎవరు ఎందుకు చేశారనేది సందేహంగా మారింది.(ఇదీ చదవండి: థియేటర్లో మహిళ మృతి.. తెలంగాణలో ఇకపై బెన్ ఫిట్ షోలు నిషేధం)Mumbai: During the film Pushpa 2: The Rule show at Gaiety Galaxy Theatre in Bandra, a substance was sprayed, causing people to cough and experience difficulty breathing pic.twitter.com/zN9RrTvgkY— IANS (@ians_india) December 5, 2024ముంబైలోని బాంద్రా గెలాక్సీ థియేటర్లో 'పుష్ప-2' షో లో స్ప్రేతో ఎటాక్.ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులు దగ్గుతో పాటు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో 15నిమిషాల పాటు మూవీని ఆపేశారు.పెప్పర్ స్ప్రేతో ఎటాక్ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.#Pushpa2 #AlluArjun pic.twitter.com/GgsqPILDZ0— greatandhra (@greatandhranews) December 6, 2024 -
థియేటర్లో నటిని వేధించిన తాగుబోతు!
ముంబై: ప్రముఖ మరాఠీ నటి ప్రియా బెర్డేకు థియేటర్లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ తాగుబోతు ఆమెను లైంగికంగా వేధించాడు. దివంగత నటుడు లక్ష్మికాంత్ బెర్డే సతీమణి అయిన ప్రియా బెర్డే తన కూతురిని తీసుకొని శనివారం సాయంత్రం థియేటర్‌కు వచ్చారు. ఆమె పక్క సీటులో కూర్చున్న ఓ వ్యక్తి తరచూ ఆమెను లైంగికంగా తాకడమే కాదు ఆ తర్వాత దాడి చేశారు. దీంతో నటి వెంటనే థియేటర్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పారిపోతున్న అతన్ని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రియా బెర్డే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు స్థానిక వ్యాపారి సునీల్ జాని (43)గా గుర్తించారు. అతడు తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు ధ్రువీకరించారు. కామెడీ పాత్రలు ప్రముఖంగా చేసే ప్రియాబెర్డే మరాఠీలో, బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు.