
బాహుబలి-2పై నాగ్ ఏమన్నారంటే..
రికార్డులతో మోత మోగిస్తున్న రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి-2 (ది కన్‌క్లూజన్) పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు.
హైదరాబాద్: రికార్డులతో మోత మోగిస్తున్న రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి-2 (ది కన్‌క్లూజన్) పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సోమవారం ట్విట్టర్ ద్వారా ఈ చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషించిన నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు. గత అదేళ్లుగా వీరు చూపించిన డెడికేషన్ అద్భుతమని కొనియాడారు.
ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి , రమ్యకృష్ణన్‌లను ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా బాహుబలి -2 కోసం అయిదు సం.రాల పాటు నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమన్నారు. జస్ట్ ఇన్‌క్రెడిబుల్.. అంటూ ట్వీట్ చేశారు.
అటు నాగార్జున్ ట్వీట్ కు దర్శకుడు రాజమౌళి స్పందించారు. తమ చిత్ర బృందం తరపున ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా ప్రతిరోజూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
Prabhas,Anushka, @RanaDaggubati @meramyakrishnan..you guys were just incredible!!your dedication towards #Baahubali2 for the last 5 yrs