ఐసిస్‌పై కొనసాగుతున్న వేట! | NIA arrested 3 more isis Sympathizers | Sakshi
Sakshi News home page

ఐసిస్‌పై కొనసాగుతున్న వేట!

Oct 8 2016 7:53 PM | Updated on Oct 17 2018 5:14 PM

ఐసిస్‌పై కొనసాగుతున్న వేట! - Sakshi

ఐసిస్‌పై కొనసాగుతున్న వేట!

దేశవ్యాప్తంగా పేలుళ్లు జరగవచ్చునన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరుల వేట కొనసాగిస్తోంది.

  • మరో ముగ్గురు సానుభూతిపరులు అరెస్టు

  • చెన్నై: దేశవ్యాప్తంగా పేలుళ్లు జరగవచ్చునన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరుల వేట కొనసాగిస్తోంది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో మరో ముగ్గురు ఐసిస్‌ సానుభూతిపరుల్ని అదుపులోకి తీసుకుంది.  భారత సైన్యం సర్జికల్‌ దాడుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ సానుభూతిపరులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కుట్రకు సంబంధించి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గత ఆదివారం ఆరుగురు ఐసిస్‌ సానుభూతిపరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ, న్యూఢిల్లీ, కేరళ నిఘావర్గాల సహకారంతో వీరిని అరెస్ట్‌ చేశారు.

    ఈ నేపథ్యంలో ఐసిస్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టిన ఎన్‌ఐఏ శనివారం కోయంబత్తూరులో  ఆ సంస్థ రహస్యా కదలికల గుట్టు రట్టు చేసింది. మరో ముగ్గురు సానుభూతిపరుల్ని అదుపులోకి తీసుకొని.. వారిని లోతుగా విచారిస్తోంది.
     

Advertisement
 
Advertisement
Advertisement