జగన్‌ బెయిల్ వార్తకు జాతీయ మీడియా ప్రాధాన్యం | National media full coverage of YS Jagan mohan reddy's Bail verdict | Sakshi
Sakshi News home page

జగన్‌ బెయిల్ వార్తకు జాతీయ మీడియా ప్రాధాన్యం

Sep 24 2013 12:33 PM | Updated on Aug 8 2018 5:51 PM

జగన్‌ బెయిల్ వార్తకు జాతీయ  మీడియా ప్రాధాన్యం - Sakshi

జగన్‌ బెయిల్ వార్తకు జాతీయ మీడియా ప్రాధాన్యం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ వచ్చిన విషయాన్ని టైమ్స్ నౌ, ఎన్డీటీవీ సహా పలు జాతీయ ఛానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి.

హైదరాబాద్ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ అంశం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పుపై ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండగా......... రాష్ట్రం వెలుపల కూడా అంతే ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా జాతీయ మీడియా జగన్ బెయిల్ వార్తకు విశేష ప్రాధాన్యం కల్పించింది. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ సహా పలు జాతీయ ఛానెళ్లు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిన విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి.

జగన్ బెయిల్‌పై తీర్పు రావడానికి ముందు నుంచే బ్రేకింగ్స్‌తో హడావుడి చేసిన జాతీయ మీడియా... బెయిల్ వచ్చిన తర్వాత ప్రాధాన్యతను మరింత పెంచాయి. కోర్టు తీర్పు సారాంశాన్ని, కోర్టు విధించిన షరతులను పేర్కొంటూనే ఎన్ని నెలలుగా జగన్ జైల్లో నిర్బంధంలో ఉన్నారనే అంశాలను వివరించాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల సంబరాలను లైవ్‌లో ప్రసారం చేశాయి. జగన్‌కు బెయిల్ రావడంపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతల ఆనందాన్ని జాతీయ ఛానెళ్లు ప్రజలతో పంచుకున్నాయి. ప్రజానేతకు సంబంధించిన అంశానికి నేషనల్ మీడియా ప్రాధాన్యం కల్పించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు, జగన్ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఇక సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడా జగన్ బెయిల్ వార్త హల్చల్ చేసింది.  వేలకొద్దీ షేరింగులు... లక్షల కొద్దీ లైకులు... జగన్‌కు బెయిలొచ్చింది.. ఫేస్‌బుక్‌కి పండగొచ్చింది..నిన్న కోర్టు తీర్పు వెలువడిన కొన్ని క్షణాల్లోనే ఫేస్‌బుక్‌లో జగన్ బెయిల్ మంజూరు వార్తను ఎవరికి వారు తామే ఈ విషయాన్ని ప్రకటించాలనే ఆత్రుతతో ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement