మైసూర్ రాజమాతకు ఎదురుదెబ్బ | Mysuru queen Pramoda Devi Wadiyar faces legal battle over Yaduveer's adoption | Sakshi
Sakshi News home page

మైసూర్ రాజమాతకు ఎదురుదెబ్బ

Jun 25 2016 5:51 PM | Updated on Sep 4 2017 3:23 AM

మైసూర్ రాజమాతకు ఎదురుదెబ్బ

మైసూర్ రాజమాతకు ఎదురుదెబ్బ

మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌కు అవాంతరం ఎదురైంది.

మైసూరు: మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌కు అవాంతరం ఎదురైంది. యదువీర్‌ను దత్తపుత్రుడిగా స్వీక రణకు సంబంధించి రాజమాత కోర్టుకు అందించిన అర్జీని శనివారం మైసూరు జిల్లా నాలుగో సివిల్ కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణకు న్యాయస్ధానం ఆదేశించారు.

రాజమాత ప్రమోదాదేవి చట్టాలను అతిక్రమించి యదువీర్‌ను దత్తపుత్రుడిగా స్వీకరించారంటూ గత ఏడాది శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ మేనల్లుడు చదురంగ కాంతరాజ్ అరస్ కోర్టులో అప్పీలు చేశారు. అయితే హిందూ ధర్మం, చట్టాల ప్రకారమే దత్తపుత్రుడిగా స్వీకరించామని రాజమాత ప్రమోదాదేవి కోర్టుకు విన్నవించారు. ఈ పిటీషన్లపై వాదోపవాదాల అనంతరం శనివారం జిల్లా నాలుగో సివిల్ కోర్టు ప్రమోదాదేవి అర్జీని కొట్టివేసి తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 27న ప్యాలెస్ కల్యాణ మంటపంలో  యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరుగనుంది.

Advertisement

పోల్

Advertisement