
సరదా కోసం వెళ్తే.. లక్షన్నర దోచేశారు!
అతడో డబ్బున్న కుర్ర మారాజు. ఉత్తరప్రదేశ్లోని ఓ ఎంపీ గారి కుమారుడు. సుఖం కొనుక్కుందామని.. ఓ కాల్గర్ల్ను మాట్లాడుకున్నాడు. కానీ.. సదరు కాల్ గర్ల్, ఆమె డ్రైవర్ కలిసి అతగాడి దగ్గర ఏకంగా లక్షన్నర రూపాయలు దోచేశారు.
అతడో డబ్బున్న కుర్ర మారాజు. ఉత్తరప్రదేశ్లోని ఓ ఎంపీ గారి కుమారుడు. సుఖం కొనుక్కుందామని.. ఓ కాల్గర్ల్ను మాట్లాడుకున్నాడు. కానీ.. సదరు కాల్ గర్ల్, ఆమె డ్రైవర్ కలిసి అతగాడి దగ్గర ఏకంగా లక్షన్నర రూపాయలు దోచేశారు. ఈ ఘటన ముంబై శివార్లలోని శాంతాక్రజ్ ప్రాంతంలో జరిగింది.
తనకు జరిగిన అన్యాయంపై సదరు ఎంపీ కుమారుడు వకోలా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఒక ఏజెంటు ద్వారా తాను ఆ కాల్గర్ల్ను మాట్లాడుకున్నానని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం వవ్హాలే తెలిపారు. కాల్ గర్ల్ తన డ్రైవర్తో కలిసి వచ్చిందని, రాగానే.. ఆ డ్రైవర్ కత్తి చూపించి తనను బెదిరించి తన దగ్గర ఉన్న రూ. 1.50 లక్షల నగదు దోచుకెళ్లిపోయారని, ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు.