మనిషి-కంప్యూటర్ మేధలు కలిస్తే ....

మనిషి-కంప్యూటర్ మేధలు కలిస్తే .... - Sakshi


న్యూయార్క్: మానవుని, కంప్యూటర్ మేధస్సులు కలిస్తే ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు వంటి అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశముందని ఓ అధ్యయనం పేర్కొంది. హ్యూమన్ కంప్యుటేషన్ ఇన్‌స్టిట్యూట్(హెచ్‌సీఐ), న్యూయార్క్‌లోని కార్నెల్ వర్సిటీలు రూపొందించిన విధానం.. పై సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. మనిషి, కంప్యూటర్ మేధస్సుల మధ్య నిరంతరం పరస్పర సంప్రదింపులతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.ఈ విధానం ప్రకారం.. పెద్ద సంఖ్యలో మనుషులు సమన్వయ వ్యవస్థ ద్వారా అందించే(క్రౌడ్ సోర్సింగ్) సమాచారాన్ని కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. తర్వాత దాన్ని మరింత మెరుగుపరచడాకి, విశ్లేషించడానికి తర్వాతి వ్యక్తికి అందిస్తుంది. ఫలితంగా సరళమైన సమన్వయ వాతావరణం నెలకొని, సమస్యల పరిష్కారానికి అవకాశమేర్పడుతుంది. ఈ ఆలోచనను ఇప్పటికే గార్డెన్ నిర్వహణకు సంబంధించిన యార్డ్‌మ్యాప్.ఆర్గ్ వంటి పలు హ్యూమన్ కంప్యుటేషన్ ప్రాజెక్టుల్లో  అమలు చేస్తున్నారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top