రాహుల్ సభలో ఎయిర్ గన్ కలకలం! | Man arrested with air gun at Rahul gandhi rally in bihar | Sakshi
Sakshi News home page

రాహుల్ సభలో ఎయిర్ గన్ కలకలం!

Sep 19 2015 4:08 PM | Updated on Jul 18 2019 2:11 PM

రాహుల్ సభలో ఎయిర్ గన్ కలకలం! - Sakshi

రాహుల్ సభలో ఎయిర్ గన్ కలకలం!

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఎయిర్ గన్ తో సంచరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చంపారన్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఎయిర్ గన్ తో సంచరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ లోని పశ్చిమ చంపారన్ రామ్ నగర్లో శనివారం మధ్యాహ్నం జరిగిన బహిరంగసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు రాహుల్ బహిరంగసభకు హాజరవుతాడనగా తయ్యబ్ జాన్ అనే యువకుడు గన్ చేతపట్టుకుని తిరుగుతుంటే గుర్తించి అరెస్టు చేసినట్లు బాగహ ఎస్పీ ఆనంద్ కుమార్ సింగ్ తెలిపారు.

అయితే నిందితుడి మానసిక పరిస్థితి బాగాలేదని, అతడి రక్షణ కోసమే గన్ వెంటతెచ్చుకున్నట్లు చెప్పాడని ఎస్పీ వివరించారు. తయ్యబ్ నుంచి బట్టలు ఓ బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చంపారన్ జిల్లాకే చెందినవాడని ఎస్పీ వెల్లడించారు. తమ విచారణలో నిందితుడు చెప్పిన వివరాలపై తమకు స్పష్టత రాలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా వచ్చాడా లేదా మానసిక ఆనారోగ్యంతో బహిరంగ సభకు వచ్చాడా అనే విషయాలపై పూర్తి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్పీ ఆనంద్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement