వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి | Mahatma Gandhi's charkha sold for Rs. 1 crore | Sakshi
Sakshi News home page

వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి

Nov 6 2013 3:23 AM | Updated on Sep 2 2017 12:18 AM

వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి

వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి

క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి మంగళవారం లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో రూ.1 కోటి ధర పలికింది

లండన్:  క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి మంగళవారం లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో రూ.1 కోటి ధర పలికింది. ఎనిమిది దశాబ్దాల క్రితం ఉద్యమకాలంలో పుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గాంధీ ఈ చరఖాను ఉపయోగించారని ముల్లక్ వేలం సంస్థ అధికారి మైఖేల్ మోరిస్ తెలిపారు. భారత్‌లో విద్య, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసిన అమెరికాకు చెందిన మెషినరీ రెవడెండ్ ఫ్లోయిడ్ ఏ పఫర్‌కు 1935లో గాంధీ ఈ చరఖాను బహుమతిగా ఇచ్చారు. అనంతరకాలంలో ఈ చరఖా చాలామంది చేతులు మారింది. గాంధీ చివరి విల్లు సైతం మంగళవారం జరిగిన వేలంపాటలో దాదాపు రూ.20,00,000 మొత్తానికి అమ్ముడుపోయింది. వీటిని వేలంలో సొంతంచేసుకున్న వారి వివరాలను సంస్థ వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement