రిలయన్స్ ఎల్వైఎఫ్ విండ్ 2 ఫాబ్లెట్ | Lyf Wind 2 With 6-Inch Display, VoLTE Support Launched at Rs. 8,299 | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ఎల్వైఎఫ్ విండ్ 2 ఫాబ్లెట్

Aug 4 2016 3:05 PM | Updated on Sep 4 2017 7:50 AM

రిలయన్స్ ఎల్వైఎఫ్ విండ్ 2 ఫాబ్లెట్

రిలయన్స్ ఎల్వైఎఫ్ విండ్ 2 ఫాబ్లెట్

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ లైఫ్ (ఎల్వైఎఫ్) సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లో విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ లైఫ్ (ఎల్వైఎఫ్) సిరీస్ లో  మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లో  విడుదల చేసింది. ఇప్పటికే  స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి  ప్రవేశించిన రిలయన్స్ రీటైల్ ..వినియోగదారులకు బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు అందిస్తోంది. లైఫ్‌ బ్రాండ్‌తో ఇప్పటికే పలు బడ్జెట్‌ ఫోన్లను విడుదల చేసిన  రిలయన్స్  ఇపుడు తాజాగా లైఫ్‌  విండ్‌ 2 పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 8,299గా  కంపెనీ నిర్ణయించింది.    ఒక సిమ్కార్డ్ స్లాట్  మాత్రమే ఒక సమయంలో 4జీ నెట్వర్క్ కోసం ఉపయోగించాలని కంపెనీ తెలిపింది.  6  ఇంచెస్ డిస్ప్లే,  4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ ఇందులో ప్రత్యేకం.  

లైఫ్‌ విండ్‌ 2  స్పెసిఫికేషన్స్:

6 అంగుళాల డిస్‌ప్లే 720x1280 ఎంపీ
1 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌
డ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
2 జీబీ రామ్‌
16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
32జీబీ ఎక్స్ పాండబుల్  మెమొరీ
8 మెగాపిక్సెల్‌ రియర్ కెమెరా
 2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్  కెమెరా
డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం,
 4జీ సపోర్టింగ్‌
 2850 ఎంఏహెచ్ బ్యాటరీ, (నాన్ రిమూవబుల్ బ్యాటరీ)

 

Advertisement
 
Advertisement
Advertisement