65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ | kcr meets representatives of 65 companies in shanghai | Sakshi
Sakshi News home page

65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ

Sep 10 2015 4:37 PM | Updated on Aug 11 2018 7:06 PM

65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ - Sakshi

65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చైనా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చైనా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. షాంఘైలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులతో ఆయన గురువారం భేటీ అయ్యారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులకు ఆయన వివరించారు. పట్టణాభివృద్ధి, నీటి పారుదల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కేసీఆర్ కోరారు.

సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం 65 కంపెనీలకు చెందిన ప్రతినిధులు కేసీఆర్ బృందంతో సమావేశమయ్యారు. వారికి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కేసీఆర్ బృందం ఓ ప్రజంటేషన్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement