షర్ట్‌లేకుండానే పెళ్లి వేడుకలో ప్రధాని! | Sakshi
Sakshi News home page

షర్ట్‌లేకుండానే పెళ్లి వేడుకలో ప్రధాని!

Published Mon, Aug 8 2016 4:16 PM

షర్ట్‌లేకుండానే పెళ్లి వేడుకలో ప్రధాని!

బీచ్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. తల్లిదండ్రులు వధువును వరుడి వద్దకు తీసుకెళుతున్నారు. అదే సమయంలో బీచ్‌లో చొక్కా లేకుండా విహరిస్తున్న ఓ వ్యక్తి.. వధువును తీసుకెళుతున్న తంతును ఆసక్తిగా వీక్షించాడు. తాను చొక్కా వేసుకోలేదన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఏకంగా ఫొటోకు పోజిచ్చాడు! ఆయన ఎవరో కాదు కెనడా యువ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడో.  తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో అనుకోని అతిథిలా దర్శనమిచ్చి.. కెమెరా కంటికి చిక్కిన ఆయన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.  

ఈ ఘటన గురించి ఈ పెళ్లి ఫొటోలను తీసిన ఫొటోగ్రాఫర్‌ మార్నీ రెకర్‌ తాజాగా ఫేస్‌బుక్‌లో వివరించారు. బ్రిటిష్‌ కొలంబియాలోని బీచ్‌లో ఈ వివాహ వేడుక జరిగిందని, ఓ రాజకీయ నాయకుడిలా కాకుండా ఓ సామాన్యుడిలా వివాహ తంతును ట్రుడో ఆసక్తిగా వీక్షించారని ఆయన తెలిపారు. కెనడా యువ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ట్రుడో అనేక ఫీట్లతో, ప్రత్యేకతలతో మీడియాలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చొక్కా లేకుండానే ఆ పెళ్లి వేడకకు అతిథిగా వెళ్లినట్టు కనిపిస్తోందని, ఆయన వధువును చూడకుండా ఫొటో పోజిస్తున్నట్టు కనిపించడమే ఇందుకు నిదర్శనమని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement