'ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్ డే' | it is black day for democracy, says sonia gandhi | Sakshi
Sakshi News home page

'ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్ డే'

Aug 3 2015 4:56 PM | Updated on Mar 18 2019 7:55 PM

లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు.

న్యూఢిల్లీ: లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్ డే అని సోనియా వ్యాఖ్యానించారు.

సోమవారం లోక్సభ కార్యకలాపాలకు అడ్డుతగిలిన 25 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ఈ రోజు ఉదయం సోనియా గాంధీ మాట్లాడుతూ.. 'మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేసేదాకా మా నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం. సభ కొనసాగనివ్వబోము. మమ్మల్ని విమర్శించేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. సభలో మెజారిటీ ఉన్నంత మాత్రాన తప్పులు ఒప్పులైపోవు' అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement