సరైన సమయంలో బై బ్యాక్‌- ఇన్ఫీ | Sakshi
Sakshi News home page

సరైన సమయంలో బై బ్యాక్‌- ఇన్ఫీ

Published Thu, Feb 16 2017 5:36 PM

Infosys says buyback to happen at 'appropriate time'

ముంబై: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు తాము వ్యతిరేకం కాదని  దేశీయ అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని  ఇన్ఫోసిస్  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌  యూబీ ప్రవీణ్ రావు  తెలిపారు.   షేర్ల బై బ్యాక్‌, కేపిటల్ అలాకేషన్,   తదితర అంశాలపై  బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ముఖ్యంగా బై బ్యాక్‌ నిర్ణయం  "తగిన సమయం"లో తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో 2017 ఆర్థిక సంవత్సరం 2016 కంటే మెరుగ్గా ఉంటుందని  చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు.
 కాగా కాగ్నిజెంట్ ఇటీవల ఒక 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే పథకం ప్రకటించడగా, ఈ నెల 20న జరగనున్న బోర్డ్ మీటింగ్‌లో  నిర్ణయించనున్నట్టు టీసీఎస్‌   కూడా ప్రకటించింది. అటు ఇన్ఫోసిస్  షేర్ల బై బ్యాక్‌ పై సంస్థ   ఇద్దరు  మాజీ  సీఎఫ్‌వోలు ఇటీవల  బాగా వత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే.  షేర్ ధరపై మేనేజ్మెంట్ నిర్ణయానికి ఫౌండర్ గ్రూప్ సుముఖంగా లేదని తెలుస్తోంది. సంస్థాగత మద్దతుపై జేపీ మోర్గాన్ సలహాలనుకూడా తీసుకోనుందని సమాచారం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement