ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు ! | Indrani Mukherjea's lawyers likely to claim in court that she was roughed up | Sakshi
Sakshi News home page

ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు !

Aug 31 2015 1:24 PM | Updated on Sep 3 2017 8:29 AM

ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు !

ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు !

విచారణ సమయంలో పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని తీవ్రంగా కొడుతున్నారని ఆమె తరుపు న్యాయవాదులు సోమవారం ముంబయి కోర్టుకు ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

ముంబయి: విచారణ సమయంలో పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని తీవ్రంగా కొడుతున్నారని ఆమె తరుపు న్యాయవాదులు సోమవారం ముంబయి కోర్టుకు ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె హత్య కేసుకు సంబంధించి పలు వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందని పోలీసులు విచారణ పేరిట ఆమెను భౌతికంగా మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించనున్నట్లు సమాచారం. తాము ఆమెను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆమె ముఖంపై చెంపదెబ్బల గాయాలు వారికి కనిపించినట్లు తెలుస్తోంది.

సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆమె కుమారుడిని కూడా హత్య చేసేందుకు ఆమె అదే రోజు పలురకాల కుట్రలకు పాల్పడిందని కూడా తెలిసింది. గతంలో పోలీసులు కోరిన కస్టడీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ గడువు మరింత కోరేందుకు మరోసారి ఆమెను సోమవారం కోర్టుకు పోలీసులు హాజరుపరచనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement