నష్టాల ట్రాక్‌పై రైలు షేర్లు | India Inc gives thumbs up to interim rail budget | Sakshi
Sakshi News home page

నష్టాల ట్రాక్‌పై రైలు షేర్లు

Feb 13 2014 1:27 AM | Updated on Sep 2 2017 3:38 AM

నష్టాల ట్రాక్‌పై రైలు షేర్లు

నష్టాల ట్రాక్‌పై రైలు షేర్లు

అటు రైల్ సంబంధిత కంపెనీలను, ఇటు ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడ ంతో ఈ షేర్లలో అమ్మకాలు పెరిగాయి.

మంత్రి మల్లికార్జున ఖార్గే బుధవారం మధ్యాహ్నం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర రైల్వే బడ్జెట్ తుస్సుమనిపించింది. నాలుగు నెలల కాలానికి ప్రకటించిన బడ్జెట్‌లో ప్రోత్సాహాన్నిచ్చే ప్రధాన ప్రకటనలేవీ లేకపోవడంతో రైల్వే షేర్లు నష్టాల ట్రాక్‌లోకి మళ్లాయి.

 అటు రైల్ సంబంధిత కంపెనీలను, ఇటు ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడ ంతో ఈ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో బీఎస్‌ఈలో హింద్ రెక్టిఫయర్స్ 10% పతనంకాగా, సింప్లెక్స్ కాస్టింగ్, కెర్నెక్స్ మైక్రో, కాళిందీ రైల్, జైకామ్ ఎలక్ట్రానిక్స్, టిటాగఢ్ వ్యాగన్స్, ట్రిల్(టీఆర్‌ఐఎల్), కంటెయినర్ కార్పొరేషన్ 5-0.5% మధ్య నీరసించాయి. స్టోన్ ఇండియా హెచ్చుతగ్గుల కులోనై చివరకు యథాతథంగా ముగిసింది.

 లాభపడ్డవీ ఉన్నాయ్
 పెట్టుబడులకు సంబంధించి రైల్ బ డ్జెట్ నిరాశపరచినప్పటికీ నెల్కో షేరు 5% ఎగసింది. ఈ బాటలో భెల్ 1.5% పుంజుకోగా, టెక్స్‌మాకో, బీఈఎంఎల్ నామమాత్రంగా లాభపడ్డాయి. రైల్ బ డ్జెట్‌లో ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించగా, ప్రైవేట్ రంగంతోపాటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పల కాలని ప్రతిపాదించారు.
 
 85 పాయింట్లు ప్లస్
 
 మూడు వారాల తరువాత బుధవారం సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడింది. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు  ఒక శాతానికి పైగా పెరగడంతో ఒక దశలో సెన్సెక్స్ 152 పాయింట్లు ఎగసింది. 20,516 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఆపై లాభాల స్వీకరణ కారణంగా అమ్మకా లు పెరగడంతో చాలావరకూ లాభాలను కోల్పోయింది. చివరికి 20,448 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 6,084 వద్ద నిలిచింది.

 టాటా స్టీల్ 4% డౌన్: సెన్సెక్స్ దిగ్గజాలలో ఐసీఐసీఐ బ్యాంక్, గెయిల్, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, భెల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, భారతీ  3-1% మధ్య పుంజుకున్నాయి. మరోవైపు టాటా స్టీల్ 4% పతనమైంది. కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ సేన్‌గుప్తా రాజీనామా వార్తలతో ఈ కౌంటర్‌లో అమ్మకాలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, ముందురోజు 2% క్షీణించిన ఆర్‌ఐఎల్ షేరు తాజాగా 1.5% బలపడింది. గ్యాస్ ధరల నిర్ణయాని కి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, ఆయిల్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement