భారీ సైనిక రవాణా విమానాన్ని సమకూర్చుకున్న భారత్ | India gets its third miltary transport heavylifter | Sakshi
Sakshi News home page

భారీ సైనిక రవాణా విమానాన్ని సమకూర్చుకున్న భారత్

Aug 23 2013 11:18 AM | Updated on Sep 1 2017 10:03 PM

భారత వైమానిక దళం మరో భారీ రవాణా విమానాన్ని సమకూర్చుకుంది.

భారత వైమానిక దళం మరో భారీ రవాణా విమానాన్ని సమకూర్చుకుంది. బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్ 3 శ్రేణిలోని మూడో విమానం మన వైమానిక దళానికి వచ్చింది. ఇది అత్యంత భారీ, విభిన్నమైన సైనిక రవాణా విమానం. భారీ పరిమాణంలోను, భారీ బరువు ఉన్న సరుకులను కూడా చాలా ఎక్కువ దూరంపాటు రవాణా చేయడం, ఎలాంటి ఉపరితలం మీదనైనా ల్యాండ్ కాగల సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకతలు.

ఆగస్టు 20వ తేదీన కాలిఫోర్నియాలోని బోయింగ్ లాంగ్ బీచ్ నుంచి భారత్కు ఈ విమానం బయల్దేరింది. ఇప్పటికే సి-17 శ్రేణిలో భారత్ వద్ద రెండు సైనిక రవాణా విమానాలున్నాయి. ఇవి జూన్, జూలై నెలల్లో మనకు వచ్చాయి. ఇప్పుడు మూడోది రాగా, మరో రెండు విమానాలను కూడా బోయింగ్ మనకు పంపనుంది.

మొత్తం పది విమానాలను సమకూర్చుకోవాలన్నది భారత వైమానిక దళ లక్ష్యం. ఇవన్నీ వచ్చాయంటే, వైమానిక రంగంలో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సి-17 విమానాలున్న దేశం మనదే అవుతుంది. 1991 నుంచి సేవలు అందిస్తున్న ఈ తరహా విమానాలను ప్రధానంగా సైనిక అవసరాలకే ఉపయోగిస్తారు. ఇప్పటికి ఈ విమానాలు 26 లక్షల ప్లయింగ్ అవర్స్ పూర్తి చేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement