పాకిస్థాన్ సక్రమంగా స్పందించినపుడే, ఆ దేశంతో చర్చల ప్రక్రియ తిరిగి కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
గుజరాత్: పాకిస్థాన్ సక్రమంగా స్పందించినపుడే, ఆ దేశంతో చర్చల ప్రక్రియ తిరిగి కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య స్తంభించిపోయిన చర్చలు తిరిగి మొదలయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్నపై రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయమై ఆయన వివరంగా ఏమీ చెప్పలేదు. గురువారం గుజరాత్‌లోని పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన సందర్బంగా రాజనాథ్ విలేకరులతో మాట్లాడారు. పొరుగుదేశమైన పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే భారత్ భావిస్తోందని, స్నేహితులనైనా మార్చుకోవచ్చగానీ, ఇరుగు పొరువారిని మార్చుకోజాలమని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌తో చర్చలకు అవకాశం ఎప్పుడూ ఉంటుందని, ఆ దేశంతో దౌత్యం ఆగిపోలేదని, దౌత్య ప్రక్రియలో ’కామాలు’, ’సెమీ కోలన్లు’ తప్ప ’ఫుల్ స్టాప్’ ఉండబోదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.