ఐడీబీఐలో కొలువుల జాతర | IDBI Bank to recruit 500 executives on contractual basis | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ లో కొలువుల జాతర

Nov 24 2016 11:22 AM | Updated on Sep 4 2017 9:01 PM

ఐడీబీఐలో కొలువుల జాతర

ఐడీబీఐలో కొలువుల జాతర

ప్రభుత్వరంగ బ్యాంక్ ఐడీబీఐ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వందలమంది ఉద్యోగులను నియమించుకోనుంది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఐడీబీఐ నిరుద్యోగులకు  శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వందలమంది  ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ మేరకు అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్  బేస్ గా సుమారు 500 ఎక్జికెటివ్ లను నియమించుకొనేందుకు రంగం సిద్ధం చేసింది.
 20-25 మధ్యగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు  అర్హులు. మూడు సంవత్సరాలపాటు ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉండనుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.17,000  ఏకీకృత వేతం నెలకు ఉంటుంది, రెండవ సంవత్సరంలో  రూ.18,500  మూడో ఏడాది రూ 20,000  చెల్లించనుంది. అలాగే మూడేళ్ల కాలాన్నివిజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు   అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఎ)  ఉద్యోగాలకు అర్హత  పొందుతారు.  అప్లికేషన్లు,  అర్హత, ఆన్లైన్ పరీక్షకేంద్రాలు తదితర పూర్తి వివరాలు  ఐడీబీఐ అధికారిక వెబ్  సైట్ లో అందుబాటులో ఉన్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement