పొత్తు కొనసాగితే సంతోషిస్తా: అద్వానీ | I would've been happy if Sena-BJP alliance continued, says Advani | Sakshi
Sakshi News home page

పొత్తు కొనసాగితే సంతోషిస్తా: అద్వానీ

Oct 2 2014 4:11 PM | Updated on Oct 8 2018 5:45 PM

పొత్తు కొనసాగితే సంతోషిస్తా: అద్వానీ - Sakshi

పొత్తు కొనసాగితే సంతోషిస్తా: అద్వానీ

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు కొనసాగివుంటే బాగుండేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ అభిప్రాయపడ్డారు.

అహ్మదాబాద్: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు కొనసాగివుంటే బాగుండేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ అభిప్రాయపడ్డారు. తమ పార్టీతో శివసేన పొత్తు కొనసాగితే సంతోషిస్తానని చెప్పారు. మిత్రపక్షంతో పొత్తు చెడకుండా ఉంటే ఆనందపడతానని అన్నారు. అయితే సీట్ల సర్దుబాటు సరిగా లేదని, మరిన్ని ఎక్కువ సీట్లు కావాలని తమ పార్టీ అడగడంలో తప్పులేదని ఆయన సమర్థించారు.

శివసేన నేత ఉద్ధవ్ థాక్రే పొత్తు విచ్ఛిన్నం గురించి తనకు ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. బీజేపీ-శివసేన సీట్ల సర్దుబాటు వ్యవహారంలో తాను జోక్యం చేసుకోలేదని తెలిపారు. అహ్మదాబాద్ లో గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో అద్వానీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement