హీరో లాభం రూ.582 కోట్లు | Hero profit of Rs .582 crore | Sakshi
Sakshi News home page

హీరో లాభం రూ.582 కోట్లు

Feb 4 2015 1:15 AM | Updated on Sep 2 2017 8:44 PM

హీరో లాభం   రూ.582 కోట్లు

హీరో లాభం రూ.582 కోట్లు

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటో కార్పొ 2014 ఆర్ధిక సంవత్సరం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటో కార్పొ 2014 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి 11.11 శాతం పెరుగుదలతో రూ.582.98 కోట్లు నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.524.66 కోట్ల లాభాలొచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ నికర అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.6,845.91 కోట్ల నుంచి అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో రూ. 6,792.51 కోట్ల స్వల్పంగా తగ్గిందని పేర్కొంది.

ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 16,48,548 యూనిట్లుగా నమోదయ్యాయని సంస్థ వైస్ చైర్మన్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. సంస్థ విస్తరణలో భాగంగా హీరో కంపెనీ ఇటీవలే కొలంబియాలో అడుగుపెట్టిందని గుర్తు చేశారు.  మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement