ఏటీఎంనే ఎత్తుకుపోయారు! | Four arrested for carrying way ATM with Rs 32 lakh | Sakshi
Sakshi News home page

ఏటీఎంనే ఎత్తుకుపోయారు!

Dec 31 2013 9:03 PM | Updated on Sep 2 2017 2:09 AM

ఏటీఎంనే ఎత్తుకుపోయారు!

ఏటీఎంనే ఎత్తుకుపోయారు!

దొంగలు ఏటీఎంపై కన్నేశారు. సుత్తెలు, కట్టర్లు తీసుకెళ్లారు. రూ. 32 లక్షలు ఉన్న ఆ ఏటీఎం మెషిన్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు

 రంగియా: దొంగలు ఏటీఎంపై కన్నేశారు. సుత్తెలు, కట్టర్లు తీసుకెళ్లారు. రూ. 32 లక్షలు ఉన్న ఆ ఏటీఎం మెషిన్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దీంతో ఏకంగా మెషిన్నే ఎత్తుకుని పారిపోయారు. అస్సాంలోని కామరూప్ జిల్లా రంగియా ముర్రా సొసైటీ ప్రాంతంలో గత నెల 29న ఈ లూటీ జరిగింది. ఏటీఎం మెషిన్‌ను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది దొంగల్లో నలుగురిని పోలీసులు మంగళవారం సెసా, దిహినా గ్రామాల్లో అరె స్ట్ చేశారు. వారి నుంచి రూ.6 లక్షల నగదు, రెండు గ్యాస్ సిలిండర్లు, రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా దొంగల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement