'మంత్రి ఆ మాట చెప్పడం సిగ్గుచేటు' | errabelli dayakar rao takes on kcr government | Sakshi
Sakshi News home page

'మంత్రి ఆ మాట చెప్పడం సిగ్గుచేటు'

Sep 2 2015 7:17 PM | Updated on Sep 3 2017 8:37 AM

'మంత్రి ఆ మాట చెప్పడం సిగ్గుచేటు'

'మంత్రి ఆ మాట చెప్పడం సిగ్గుచేటు'

తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

గాంధీ జయంతిలోగా చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చీప్ లిక్కర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే బంద్ చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. గుడుంబాను అరికట్టకపోతే దిగిపోవాలని, చీప్ లిక్కర్తో గీతకార్మికులకు అన్యాయం చేయవద్దని అన్నారు. సచివాలయంలో ఓ మంత్రి.. చీప్ లిక్కర్ను ఆయుష్షు పెంచే సంజీవనిగా  పేర్కొనడం సిగ్గుచేటని ఎర్రబెల్లి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement