ఈవీఎంలపై 12న కీలక భేటీ | EC calls an All Party Meeting on EVM issue on May 12th | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై 12న కీలక భేటీ

May 4 2017 1:06 PM | Updated on Jul 11 2019 8:26 PM

ఈవీఎంలపై 12న కీలక భేటీ - Sakshi

ఈవీఎంలపై 12న కీలక భేటీ

ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో

అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ

న్యూఢిల్లీ‌: ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 12న ఢిల్లీలో అఖిలపక్ష భేటీని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీ నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలను ఎత్తివేసి తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే విపక్ష నేతల బృందం ఈసీని కలిసి ఓ విజ్ఞాపనను అందజేసింది. అయితే, ఈవీఎంలపై ఆరోపణలు ఖండించిన ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈవీఎంలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు రానున్న ఎన్నికల్లో వోటర్‌ వెరీఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు ఈసీ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement