పదోన్నతులకు డీపీసీ | DPC to be promotions | Sakshi
Sakshi News home page

పదోన్నతులకు డీపీసీ

Sep 9 2015 1:38 AM | Updated on Sep 3 2017 9:00 AM

కళాశాల విద్యా శాఖలో ద్వితీయ శ్రేణి గెజిటెడ్ అధికారి పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యా శాఖలో ద్వితీయ శ్రేణి గెజిటెడ్ అధికారి పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రెండేళ్ల కాలపరిమితితో పని చేస్తుందని పేర్కొన్నారు.
 
 మైనార్టీ శాఖకు రూ.30 కోట్లు మంజూరు
 మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్ షిప్ కింద రూ.30 కోట్లు  మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement