ఆస్తుల మాదిరే కృష్ణా జలాలూ పంచాలి | Devide krishna water also as property divide | Sakshi
Sakshi News home page

ఆస్తుల మాదిరే కృష్ణా జలాలూ పంచాలి

Sep 8 2016 12:38 AM | Updated on Sep 2 2018 5:24 PM

ఆస్తుల మాదిరే కృష్ణా జలాలూ పంచాలి - Sakshi

ఆస్తుల మాదిరే కృష్ణా జలాలూ పంచాలి

విభజన చట్టం ప్రకారం జనా భా ప్రాతిపదికగా ఏపీ, తెలంగాణకు ఆస్తులు పంచినట్లే.. కృష్ణా జలాలను కూడా పంపిణీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

- కృష్ణా ట్రిబ్యునల్ లో స్పష్టం చేసిన కేంద్రం 
- కేంద్రం వాదనతో విభేదించిన తెలుగు రాష్ట్రాలు

సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం జనా భా ప్రాతిపదికగా ఏపీ, తెలంగాణకు ఆస్తులు పంచినట్లే.. కృష్ణా జలాలను కూడా పంపిణీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటకలకు ట్రిబ్యునల్ గతంలో జరిపిన కేటాయింపులపై ప్రభావం పడకుం డా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాలను పంచాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు బుధవారం కేంద్రం తరఫు న్యాయవాది వసీం ఖాద్రీ వాదించారు. అయితే వివాదాన్ని ఏపీ, తెలంగాణలకే పరిమితం చేసే అధికారం కేం ద్రానికి కానీ, సుప్రీంకోర్టుకు కానీ లేదని, నీటి వివాదాల్లో సర్వాధికారాలు ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉన్నాయని తెలుగు రాష్ట్రాలు వాదించాయి.

మొదట కేంద్రం తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 2013లో ట్రిబ్యునల్ వెలువరించిన తుది తీర్పునకు, ప్రస్తుత అం శానికి సంబంధం లేదని, సుప్రీంలో స్టే విధిం చిన కారణంగానే అవార్డు అమలులో లేదన్నా రు. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం స్టే విధించిందని గుర్తు చేశారు. అయితే, తర్వాత జరిగిన పరి ణామాల్లో ఉమ్మడి ఏపీ విభజన జరిగిందని, విభజన చట్టం ప్రధాన ఉద్దేశం రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించడం, జనాభా నిష్పత్తిలో ఆస్తులను పంచడం తదితర అన్ని అంశాలపై చట్టంలోని వివిధ సెక్షన్లలో వివరించారని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. నీటిని కూడా ఆస్తిగానే పరిగణించాలని, సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాలను ఉమ్మడి ఏపీ కేటాయింపుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలన్నా రు. దీనికి సంబంధించి గతంలోనూ సుప్రీం లో కేంద్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేశామని గుర్తుచేశారు. ఆ అఫిడవిట్ ప్రతిని ట్రిబ్యునల్‌కు అందజేశారు. ఉనికిలో ఉందన్న కారణంగానే ట్రిబ్యునల్‌కు నీటి కేటాయిం పుల బాధ్యత అప్పగించారని, అది కూడా నీటి వివాదాల చట్టం ప్రకారం కాకుండా విభజన చట్టం ప్రకారం ఇచ్చారని చెప్పారు.

ట్రిబ్యునల్‌కే సర్వాధికారాలు: తెలుగు రాష్ట్రాలు
కేంద్రం వాదనలతో ఏపీ, తెలంగాణ విభేదించాయి. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం చేసే అధికారం కేం ద్రానికి లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదించారు. అంతర్‌రాష్ట్ర నీటి వివాదాల్లో అంతిమ నిర్ణయం ట్రిబ్యునల్‌దేనన్నారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలనుకుంటే సెక్షన్ 89ను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. విభన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం కేటాయింపులను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని పార్లమెంట్ భావించి ఉంటే ట్రిబ్యునల్‌ను ప్రస్తావించకపోయేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. ట్రిబ్యునల్ ముందు గురువారం వాదనలు కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement