ఉత్తరాఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్ కాల్పుల కేసులో శుక్రవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఉత్తరాఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్ కాల్పుల కేసులో శుక్రవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్ నివాసం వద్ద ఇటీవల జరిగిన కాల్పుల సంఘటనలో ప్రణవ్ నిందితుడిగా ఉన్నారు. సహచర ఎమ్మెల్యేలు, ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ పాల్గొన్న విందులో ఆయన తుపాకీతో కాల్పులు జరపగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ప్రణవ్ లొంగిపోయారు. ఈ విషయాన్ని డెహ్రాడూన్ సీనియర్ ఎస్పీ కెవాల్ ఖురానా వెల్లడించారు. కాగా ఆయనకు వెంటనే బెయిల్ మంజూరైనట్టు తెలిపారు. ఐతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన తుపాకీని ఇంకా పోలీసుల వద్ద డిపాజిట్ చేయలేదు. తుపాకీని స్వాధీనం చేసుకునేందుకు శనివారం పోలీసుల బృందం హరిద్వార్ వెళ్లనుంది.