'స్మృతి' విద్యార్హతలపై 25న విచారణ | Complaint against Smriti Irani to be heard on April 25 | Sakshi
Sakshi News home page

'స్మృతి' విద్యార్హతలపై 25న విచారణ

Apr 16 2015 7:52 PM | Updated on Jul 11 2019 5:01 PM

'స్మృతి' విద్యార్హతలపై 25న విచారణ - Sakshi

'స్మృతి' విద్యార్హతలపై 25న విచారణ

ఎన్నికల అఫిడవిట్లో కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు వివరాలు పొందుపరిచారన్న ఆరోపణల కేసుపై పాటియాల కోర్టు ఏప్రిల్ 25 వాదోపవాదాలు విననుంది.

న్యూఢిల్లీ: ఎన్నికల అఫిడవిట్లో కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు వివరాలు పొందుపరిచారన్న ఆరోపణల కేసుపై పాటియాల కోర్టు ఏప్రిల్ 25 వాదోపవాదాలు విననుంది. 2004 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్మృతి తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1996 బీఏ కోర్సులో ఉత్తీర్ణత పొందినట్లు పేర్కొన్నారని.. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం అదే ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1996లో బీకామ్ పూర్తి చేసినట్లు వెల్లడించారని అహ్మర్ ఖాన్ అనే వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇలా విద్యార్హతలను ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు విధంగా పేర్కొన్న ఆమె పదవికి అనర్హురాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఈ నెల 25న విచారణ జరపనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement