'ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలి' | centre to solve problems between ap, telangana, says iyr krishnarao | Sakshi
Sakshi News home page

'ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలి'

Sep 8 2015 5:34 PM | Updated on Sep 3 2017 9:00 AM

'ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలి'

'ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలి'

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారం కాలేదు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ ఉద్యోగుల విభజన వివాదంపై ఏకాభిప్రాయం రాలేదు. మంగళవారం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు సమావేశమై చర్చించారు.

అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తొలగించిన విద్యుత్ ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు లేక బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగుల విభజన వివాదంపై ఏకాభిప్రాయం రాలేదని చెప్పారు. స్థానికత ఆధారంగా తొలగించామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని, తాము జనాభా ప్రతిపదికన విభజించాలని కోరామని తెలిపారు. అన్ని వివాదాల్లోనూ సమస్య ఇలానే ఉందని, ఉద్యోగుల విభజన కొలిక్కిరాలేదని కృష్ణారావు చెప్పారు. ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement