వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్! | Buffett Loses $1.4 Billion as Wells Fargo Tumbles on Scandal | Sakshi
Sakshi News home page

వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!

Sep 14 2016 4:50 PM | Updated on Sep 15 2018 3:51 PM

వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్! - Sakshi

వారెన్ బఫెట్ కు దిమ్మదిరిగే షాక్!

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (86) దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేవలం ఒక్క రోజులో 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,375 కోట్లు) నష్టపోయాడు.

 శాన్ ఫ్రాన్సిస్కో:  ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (86) దిమ్మతిరిగే షాక్ తగిలింది.   ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్ గా పేరొందిన బఫెట్   కేవలం ఒక్క రోజులో వేల కోట్ల రూపాయలను నష్టపోవడం మార్కెట్ వర్గాలను విస్మయపర్చింది.    1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,375 కోట్లు) నష్టపోయాడు.  బఫెట్ మేజర్  పెట్టుబడులు  పెట్టిన అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న  అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల యాజమాన్య సంస్థ ఫార్గో అండ్ కో  భారీ కుంభకోణంలో  ఇరుక్కుకోవడంతో ఈ పరిణామం సంభవించింది. 65.8  బిలియన్ డాలర్ల తోప్రపంచంలోనే నాలుగో అత్యధిక ధనవంతుడిగా ఉన్న బఫెట్  వేలకోట్ల సంపద క్షణాల్లోఆవిరైపోయింది.  బఫెట్ కు చెందిన  బెర్కషైర్ హాత్వే ఇంక్ వెల్స్ ఫార్గో లో అత్యధిక వాటాను కలిగింది.

నిబంధనలను విరుద్ధంగా రెండు మిలియన్లకు  పైగా అకౌంట్లు తెరిచారన్న ఆరోపణలతో 185 మిలియన్ డాలర్లను జరిమానాను కంపెనీ ఎదుర్కోంటోంది. సంస్థ ఉద్యోగులు ఆయా ఖాతాదారుల అనుమతులు లేకుండా 20 లక్షలకు పైగా ఖాతాలు తెరిచిరన కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా వేల్స్ ఫార్గో ఈక్విటీ విలువ 3.3 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఈ సంస్థలో అత్యధిక వాటాదారుగా ఉన్న బెర్క్ షైర్ హాత్ వే ఈక్విటీ 2 శాతం పడిపోయింది. 

మరోవైపు ఈ భారీ జరిమానా సంస్థను తీవ్రంగా బాధించిందని , తమ  ప్రతిష్టకు భంగం కలిగిందని బ్యాంక్ ప్రకటించింది.  రిటైల్ బ్యాంకర్ల  దూకుడు ఉత్పత్తి అమ్మకపు గమ్యాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెల్స్ ఫార్గో సీఈవో జాన్ స్టంఫ్  వచ్చేవారం సెనేట్ బ్యాంకింగ్ కమిటీముందు హాజరు కానున్నారు. 2013 లో లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ లో ఈ విషయంలో తొలిసారి  వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన ఫార్గో  అనుమతిలేకుండా ప్రారంభించిన ఖాతాలకు సంబంధించిన ఫీజును వాపస్  చేస్తామని వెల్లడించింది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement