ఆదివాసీలకు మమత ఆపన్నహస్తం | Bengal to help adivasis coming from Assam, says Mamata Banerjee | Sakshi
Sakshi News home page

ఆదివాసీలకు మమత ఆపన్నహస్తం

Dec 25 2014 5:47 PM | Updated on Sep 2 2017 6:44 PM

ఆదివాసీలకు మమత ఆపన్నహస్తం

ఆదివాసీలకు మమత ఆపన్నహస్తం

అసోం నుంచి పునరావాసం కోసం తమ రాష్ట్రానికి వచ్చే ఆదివాసీలకు సహాయం చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు.

కోల్కతా: అసోం నుంచి పునరావాసం కోసం తమ రాష్ట్రానికి వచ్చే ఆదివాసీలకు సహాయం చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. ఆదివాసీలకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అసోంలో తీవ్రవాదులు ఆదివాసీలను కాల్చిచంపిన ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఆమె పోస్ట్ పెట్టారు. దీని తర్వాత ఆదివాసీలు పునరావాసం కోసం తమ రాష్ట్రానికి వస్తున్నారన్నారు. హింసాత్మక చర్యలు విడనాడాలని తీవ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. అసోంలోని సోనిట్ పూర్, కొక్రాఝర్ జిల్లాల్లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 78 మంది ఆదివాసీలు మృతి చెందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement