ఏకే-47 సృష్టికర్త కలష్నికోవ్ కన్నుమూత | AK-47 designer Mikhail Kalashnikov dead at 94 | Sakshi
Sakshi News home page

ఏకే-47 సృష్టికర్త కలష్నికోవ్ కన్నుమూత

Dec 24 2013 3:58 AM | Updated on Jun 4 2019 6:41 PM

ఏకే-47 సృష్టికర్త కలష్నికోవ్ కన్నుమూత - Sakshi

ఏకే-47 సృష్టికర్త కలష్నికోవ్ కన్నుమూత

ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ (94) సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు.

మాస్కో: ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ (94) సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు. సోవి యట్ యూనియన్ హయాంలో ఏకే-47 రూపొందించినందుకు కలష్నికోవ్ జాతీయస్థాయిలో గౌరవాదరణలు పొందారు. ‘అవ్తొమాత్ కలష్నికోవ్’ రైఫిల్‌ను మిహాయిల్ కలష్నికోవ్ 1947లో రూపొందించడంతో ఈ రైఫిల్‌కు ఏకే-47 అనే పేరు వచ్చింది. పలు దేశాల సాయుధ బలగాలతో పాటు ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం ఏకే-47 రైఫిళ్లను నేటికీ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్లకు పైగా ఏకే-47 రైఫిళ్లు వాడుకలో ఉన్నట్లు అంచనా. కాగా, సైబీరియాలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కలష్నికోవ్ తొలుత రైల్వే క్లర్క్‌గా పనిచేశారు. తర్వాత 1938లో రెడ్ ఆర్మీలో చేరిన తర్వాత సోవియెట్ యుద్ధట్యాంకుల ఆధునికీకరణ వంటి పనుల్లో కీలకపాత్ర పోషించారు. నాజీ బలగాలతో 1941లో జరిగిన పోరులో గాయపడ్డ కలష్నికోవ్, ఆస్పత్రి నుంచి బయటపడ్డాక ఐదేళ్లు శ్రమించి ఏకే-47 రైఫిల్‌కు రూపకల్పన చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement