breaking news
Mikhail Kalashnikov
-
ఏకే-47 తయారు చేసి తప్పు చేశాను: కలష్నికోవ్
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకుల మరణాలకు కారణమైయ్యాననే కారణంతో ఏకే-47 రూపశిల్పి మిఖాయిల్ కలష్నికోవ్ తన మరణానికి ముందు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భయకరమైన అత్యాయుధాన్ని రూపొందించినందుకు కుమిలిపోతూ మాస్కో పాట్రియార్క్, ఆల్ రష్యా క్రిరిల్ 1 కు తన మరణానికి ఆరు నెలల ముందు గత డిసెంబర్ లో లేఖ రాశారు. తాను రూపొందించిన ఆయుధం కారణంగా అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటం ఆయనను ఆందోళనకు గురిచేస్తోందని లేఖలో వెల్లడించారు. ఆయన రష్యాలోని ఓ సాంప్రదాయ చర్చి అధినేతతో తన బాధను పంచుకున్నట్టు ఇజ్వేషియా దినపత్రిక ఓ కథనం వెలువడింది. 'నేను రూపొందించిన ఏకే-47 ఆయుధం అనేక ప్రాణాల మంది మరణానికి కారణమవుతోంది. సమాధానం దొరకని అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. లోలోపల చాలా బాధపడుతున్నాను' అని చర్చి పెద్దతో కలష్నికోవ్ తన బాధను పంచుకున్నారని తెలిపారు. మన దేశంలో ఎన్నో చర్చిలు, శాంతి సంఘాలు ఏర్పడ్డాయి. అయినా ఉగ్రవాదమనే భూతాన్ని తుదముట్టించలేకపోయాయి. మంచి-చెడు, వెలుగు-నీడలు అనేవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ఒకటి లేక మరొకటి ఉండవు. వాటిని ఇలాగేనా దేవుడు రూపొందించేది?. ఇలాంటి పరిస్థితిలోనే మానవాళి జీవించాల్సిందేనా అని కలష్నికోవ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇటీవల చర్చిపై దాడి జరిగిన సమయంలోనే కలష్నికోవ్ లేఖను రాసినట్టు ఇజ్వేషియా వెల్లడించింది. -
AK-47 రూపశిల్పి కన్నుమూత
-
ఏకే-47 సృష్టికర్త కలష్నికోవ్ కన్నుమూత
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ (94) సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు. సోవి యట్ యూనియన్ హయాంలో ఏకే-47 రూపొందించినందుకు కలష్నికోవ్ జాతీయస్థాయిలో గౌరవాదరణలు పొందారు. ‘అవ్తొమాత్ కలష్నికోవ్’ రైఫిల్‌ను మిహాయిల్ కలష్నికోవ్ 1947లో రూపొందించడంతో ఈ రైఫిల్‌కు ఏకే-47 అనే పేరు వచ్చింది. పలు దేశాల సాయుధ బలగాలతో పాటు ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం ఏకే-47 రైఫిళ్లను నేటికీ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్లకు పైగా ఏకే-47 రైఫిళ్లు వాడుకలో ఉన్నట్లు అంచనా. కాగా, సైబీరియాలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కలష్నికోవ్ తొలుత రైల్వే క్లర్క్‌గా పనిచేశారు. తర్వాత 1938లో రెడ్ ఆర్మీలో చేరిన తర్వాత సోవియెట్ యుద్ధట్యాంకుల ఆధునికీకరణ వంటి పనుల్లో కీలకపాత్ర పోషించారు. నాజీ బలగాలతో 1941లో జరిగిన పోరులో గాయపడ్డ కలష్నికోవ్, ఆస్పత్రి నుంచి బయటపడ్డాక ఐదేళ్లు శ్రమించి ఏకే-47 రైఫిల్‌కు రూపకల్పన చేశారు.