ఎయిర్‌టెల్ చేతికి క్వాల్‌కామ్ విభాగం | Airtel acquires Qualcomm’s 4G company | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ చేతికి క్వాల్‌కామ్ విభాగం

Oct 19 2013 1:36 AM | Updated on Sep 1 2017 11:45 PM

అమెరికన్ సంస్థ క్వాల్‌కామ్‌కి చెందిన వైర్‌లెస్ బిజినెస్ సర్వీసెస్ (డబ్ల్యూబీఎస్‌పీఎల్) కంపెనీలో వంద శాతం వాటాలను దక్కించుకున్నట్లు దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం తెలిపింది.

న్యూఢిల్లీ: అమెరికన్ సంస్థ క్వాల్‌కామ్‌కి చెందిన వైర్‌లెస్ బిజినెస్ సర్వీసెస్ (డబ్ల్యూబీఎస్‌పీఎల్) కంపెనీలో వంద శాతం వాటాలను దక్కించుకున్నట్లు దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం తెలిపింది. అయితే, ఈ డీల్ విలువ వివరాలు మాత్రం తెలపలేదు. గతేడాది డబ్ల్యూబీఎస్‌పీఎల్‌లో ఎయిర్‌టెల్ సుమారు 165 మిలియన్ డాలర్లకు 49 శాతం వాటాలు కొంది.

తాజాగా మిగతా వాటాలు కొంది. అప్పట్లో వాటాల కొనుగోలుకు వెచ్చించిన రేటును బట్టి చూస్తే ప్రస్తుత డీల్ విలువ సైతం సుమారు 165 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,008 కోట్లు) మేర ఉంటుందని అంచనా. డబ్ల్యూబీఎస్‌పీఎల్‌కి ముంబై, ఢిల్లీ, హర్యానా, కేరళ సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ (4జీ) సర్వీసులు అందించేందుకు కావాల్సిన స్పెక్ట్రం ఉంది. ఎయిర్‌టెల్ ఇప్పటికే బెంగళూరు, పుణె, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 4జీ సర్వీసులు అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement