వామ్మో! ఆ సీన్ చూసి.. బిత్తరపోతున్నారు! | A Woman Was Shot Straight In The Head... | Sakshi
Sakshi News home page

వామ్మో! ఆ సీన్ చూసి.. బిత్తరపోతున్నారు!

Jul 27 2016 10:03 AM | Updated on Jul 26 2018 5:23 PM

వామ్మో! ఆ సీన్ చూసి.. బిత్తరపోతున్నారు! - Sakshi

వామ్మో! ఆ సీన్ చూసి.. బిత్తరపోతున్నారు!

ఓ వ్యక్తి దూరం నుంచి తుపాకీని గురిపెట్టి కాల్చాడు. తూటా నేరుగా వచ్చి.. గుడిలో ఉన్న ఓ మహిళ కణతలోకి దూసుకుపోయింది.

ఓ వ్యక్తి దూరం నుంచి తుపాకీని గురిపెట్టి కాల్చాడు. తూటా నేరుగా వచ్చి.. గుడిలో ఉన్న ఓ మహిళ నుదురులోకి దూసుకుపోయింది. సహజంగా తూటా తలలోకి దిగితే.. ఎవరైనా క్షణాల్లో చనిపోతారు. కానీ, అందులో డ్రామా ఏముంటుంది... డ్రామా, ఏమోషనల్ లేనిది సీరియల్‌ ఎలా అవుతుంది. సీరియల్‌ అంటేనే జీడిపాకంలా ఎంతకూ ఎడతెగకుండా.. ఎన్నటికీ ముగిసిపోకుండా  కొనసాగుతూనే ఉంటుంది. ఎలాంటి దృశ్యమైనా సాగదీస్తూ.. సాగదీస్తూ సాగిపోతోంది.

అందుకు ఇదిగో ఈ సీరియల్‌ దృశ్యమే నిదర్శనమంటూ సోషల్‌ మీడియాలో ఓ తమిళ సీరియల్‌ దృశ్యం హల్‌చల్ చేస్తుంది. సీరియల్‌ సృష్టించే అరాచకం ఏస్థాయిలో ఉంటుందో ఈ దృశ్యమే నిదర్శనమని నెటిజన్లు ఈ వీడియోను హోరెత్తిస్తున్నారు. నిజానికి ఈ వీడియోను చూసినవారు ఓవైపు ఎమోషనల్‌ డ్రామాకు లోనవుతూనే.. ఏంటీ సాగదీత అని విస్మయం చెందకమానరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement