కాశీకి బయల్దేరిన 40 మందికి అస్వస్థత | 40 telugu people suffered food poisoning after consuming food | Sakshi
Sakshi News home page

కాశీకి బయల్దేరిన 40 మందికి అస్వస్థత

Aug 3 2014 6:54 PM | Updated on Oct 5 2018 6:48 PM

తీర్థయాత్రలో భాగంగా కాశీయాత్రకు బయల్దేరిని తెలుగువారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

కోల్ కతా: తీర్థయాత్రలో భాగంగా కాశీయాత్రకు బయల్దేరిని తెలుగువారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. కోల్ కతా వద్ద కలుషితం ఆహారం తిని ఆదివారం 40 మంది తెలుగువాసులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వీరిని హౌరాలోని మార్వాడి స్టీట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి కాశీ యాత్ర బయల్దేరి అస్వస్థతకు గురైయ్యారు.  ప్రస్తుతం తమ తిరుగుప్రయాణానికి డబ్బుల్లేవని ఏకరవు పెడుతున్నారు.  ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement