అతిలోక సుందరి అమ్మ(మ్మ) మనోళ్లే | Sridevi Grand Mother and relatives in Garampalle Village | Sakshi
Sakshi News home page

అతిలోక సుందరి అమ్మ(మ్మ) మనోళ్లే

Feb 26 2018 11:34 AM | Updated on Feb 26 2018 11:34 AM

Sridevi Grand Mother and relatives in Garampalle Village - Sakshi

పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు వచ్చిన శ్రీదేవి బంధువులతో మాట్లాడుతున్న దృశ్యం (ఫైల్‌)

రాయచోటి రూరల్‌ / కడప కల్చరల్‌: నిజంగా ఆమె అతిలోక సుందరే. ఆదివారం ఆమె ఇక లేరన్న వార్త విన్న జిల్లా వాసులు ఎంతో బాధపడ్డారు. శ్రీదేవి పెద్దలు మన జిల్లా సరిహద్దు ప్రాంతానికి  చెందిన  వారేనని తెలియడంతో ఒకింత ఊరట చెందారు. శ్రీదేవి అమ్మమ్మ రాయచోటి సమీపంలోని గ్యారంపల్లె గ్రామానికి చెందిన వారు. దిగ్గజనటి తల్లి ఈ గ్రామంలో జన్మించారని  ఆ ప్రాంతానికి చెందినవారు శ్రీదేవి  సమీప బంధువులు తెలుపుతున్నారు. తర్వాత  తిరుపతికి, అటు నుంచి చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తంమీద అతిలోక సుందరి శ్రీదేవి మూలాలు మన జిల్లాలోని అతి సమీప ›ప్రాంతానికి చెందినవి కావడం విశేషం. శ్రీదేవి  గత ఏడాది ఆగస్టు 13న తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు వచ్చారు. ఆమెను కలిసివచ్చామని  పిన్నమ్మ మునిరాజమ్మ,   చెబుతున్నారు. ఆ సమయంలో  తీసుకున్న కొన్ని ఫొటోలను సాక్షికి ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement