‘అవిశ్వాసం’ పేరుతో  మలేషియా టూర్‌కు సిద్ధం 

ZPTC To Foreign Tour - Sakshi

16న వెళ్లేందుకు జెడ్పీటీసీల ప్లాన్‌

సభ్యులను మచ్చిక చేసుకునేందుకు పాలకపక్షం రెడీ

స్థానిక సంస్థల అధ్యక్షులను అవిశ్వాస భయం వెంటాడుతోంది. నాలుగేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా సభ్యులు.. అధ్యక్షుల ముందు పలు డిమాండ్లు పెడుతున్నారు. వారి గొంతెమ్మ కోరికలను తీర్చేందుకు పాలకపక్షం కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే పలు మండలాల్లో అవిశ్వాస తీర్మా నం నోటీసు ఇవ్వడమే తరువాయి..

ఎంపీటీసీ సభ్యులు క్యాంపులుగా విడిపోయి పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు బయలుదేరారు. తాజాగా జెడ్పీటీసీ సభ్యులు కూడా వీరి బాటలో విదేశీయాత్రకు సూటు, బూటు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం.. అవిశ్వాసం మాట దేవుడెరుగు.. ఒక్క ఝలక్‌ ఇచ్చి పని చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సతీమణి సునీత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యాలాల జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌ తరుఫున గెలుపొందిన ఆమె అనూహ్య పరిణామాల నడుమ జడ్పీ పీఠాన్ని అధిరోహించారు. తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, టీడీపీ సభ్యుల మద్దతు కూడగట్టుకోవడం.. విపక్ష కాం గ్రెస్‌ పార్టీలో చీలిక తీసుకురావడం ద్వారా సునాయాసంగా విజయం సాధించారు.

అనంతరం జరిగిన సమీకరణల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు సభ్యులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా జిల్లా పరిషత్‌ పాలన సజావుగా సాగుతోంది. అయితే, తాజాగా చోటుచేసుకున్న పరిణామల నేపథ్యంలో గతంలో అండగా నిలిచిన జెడ్పీటీసీలు తమ మాట చెల్లుబాటు కావడంలేదనే ప్రస్తుతం అసమ్మతి స్వరం వినిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈ క్రమంలోనే నాలుగేళ్ల కాలపరిమితి పూర్తి కావడం.. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు అవకాశం లభించడంతో కొందరు సభ్యులు చైర్‌పర్సన్‌పై  ఈ దిశగాయోచిస్తున్నట్లు లీకులు వదిలారు. వాస్తవానికి అవిశ్వాసం ప్రకటించినా నెగ్గే పరిస్థితి లేనప్పటికీ, లీకుల ద్వారా ఎంతో కొంత వెనుకేసుకోవాలనే ఆలోచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో శిబిరాలు నిర్వహించిన అనుభవం..ఆర్థికంగా అదుకున్నారనే పేరు మంత్రి మహేందర్‌రెడ్డికి ఉండడంతో ఈ ఎత్తుగడ వేసినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు అవిశ్వాసం జోలికి వెళ్లకుండా విదేశీ టూర్‌కు వెళితే బాగుంటుందనే ప్రతిపాదన తెచ్చారు.

మరో 11 నెలల్లో పదవీకాలం ముగిస్తున్నందున అనవసరపు ఖర్చేందుకు అని భావించి విదేశీయానమే బెటరనే నిర్ణయానికి వచ్చారు. పార్టీకతీతంగా ఈ ప్రతిపాదనకు ఓకే చేసిన సభ్యులు సింగపూర్, మలేషియా లేదా కొరియా పర్యటనకు వెళ్లే అం శాన్ని పరిశీలిస్తున్నారు.  వచ్చే నెల 16న విదేశాలకేగాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన సభ్యులు.. ఎక్కడి వెళ్లాలి? ఎన్నిరోజుల షెడ్యూల్‌ అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top