మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికిై వెఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్ | ysrcp candidate nomination | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికిై వెఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్

Apr 8 2014 3:06 AM | Updated on Oct 17 2018 6:27 PM

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికిై వెఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్ - Sakshi

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికిై వెఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ సీపీ ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి వైఎ స్సార్ సీపీ ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రావు వెంట ఖమ్మం జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు భారీగా తరలివచ్చారు.
 
 పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్ ముత్తినేని సోమేశ్వర్‌రావు, రాము తదితరులు వెంకట్రావును కలిసి సంఘీభావం తెలిపారు. వెంకట్రావు, పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లు, ముత్తినేని సోమేశ్వర్‌రావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ పౌసుమిబసుకు అందజేశారు.
 
ఐదు అసెంబ్లీ స్థానాలు మావే..

ఖమ్మం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని సోమేశ్వర్‌రావును ఆయన కోరారు. వెంకట్రావు వెంట ఖమ్మం జిల్లా నేతలు ఉడుముల లక్ష్మారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వట్టం రాంబాబు, పోలెబోయిన తిరుపతిరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement