త్వరలో వైఎస్సార్‌ సీపీ బస్సు యాత్ర | Ysrcp Bus Tour Soon | Sakshi
Sakshi News home page

త్వరలో వైఎస్సార్‌ సీపీ బస్సు యాత్ర

Apr 5 2018 9:03 AM | Updated on Aug 15 2018 9:06 PM

Ysrcp Bus  Tour Soon - Sakshi

మాట్లాడుతున్న సంగాల ఈర్మియా

హసన్‌పర్తి : త్వరలోనే తెలంగాణలో వైస్సార్‌సీపీ బస్సు యాత్ర  ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా తెలిపారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలో చివరి వారంలో జిల్లాలో   బస్సు యాత్ర  పర్యటించనున్నట్లు వివరించారు. పార్టీ పటిష్టత కోసం జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలతో పాటు బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ గ్రామాల్లో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.  
మాటల మాంత్రికుడు కేసీఆర్‌
కేసీఆర్‌ మాటల మాంత్రికుడని సంగాల ఈర్మియా పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌... ఆ తర్వాత అసెంబ్లీలో మాత్రం ప్రతి ఇంటికి ఉద్యోగం సా«ధ్యమా అని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని గద్దెనెక్కిన టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇప్పటి వరకు గ్రామాల్లో  ఒక్క రూంకు కూడా శంకుస్థాపన చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పోడిచిన కేసీఆర్‌కు విద్యార్థులకు తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు.  బూటకపు మాటలతో గారడి చేస్తున్న సీఎంను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సమావే«శంలో వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి మేకల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement