తెలంగాణ రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను వైఎస్సార్సీపీ సోమవారం ప్రకటించింది.
వైఎస్సార్సీపీ కీలక నియామకాలు
Published Mon, Mar 13 2017 6:00 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ‍్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి 23 మంది అసెంబ్లీ కో-ఆర్డినేటర్లను నియమించారు. వీరితో పాటు పది జిల్లాలకు ఇన్‌చార్జీలు, ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీలో పలువురు కార్యదర్శులు, అధికార ప్రతినిధులను నియమించారు.
శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే
డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి (హుజుర్‌నగర్), జి.శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), మందడి సరోజ్‌రెడ్డి(దేవరకద్ర), డాక్టర్ నగేష్ (కరీంనగర్), అప్పం కిషన్ (భూపాలపల్లి), బీస మరియమ్మ (జడ్చర్ల), జెట్టి రాజశేఖర్ (అలంపూర్), ఇరుగు సునీల్‌కుమార్ (నకిరేకల్), సంగాల ఇర్మియా (వర్థన్నపేట), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), బి.అనిల్‌కుమార్ (ఆదిలాబాద్), వి.సతీష్ (మంచిర్యాల), బి.సంజీవరావు (ఆంథోల్), జి.రాంభూపాల్‌రెడ్డి (కొల్లాపూర్), ఎం.భగవంతురెడ్డి (నాగర్‌కర్నూలు), ఎం.విష్ణువర్థన్‌రెడ్డి (వనపర్తి), నాడెం శాంతికుమార్ (నర్సన్నపేట్), లక్కినేని సుధీర్‌బాబు (ఖమ్మం), బొబ్బిలి సుధాకరరెడ్డి (షాద్‌నగర్), సెగ్గం రాజేశ్ (మంథని), వెల్లాల రామ్మోహన్ (సనత్‌నగర్), కొండా రాఘవరెడ్డి (రాజేంద్రనగర్), డా.ప్రఫుల్లారెడ్డి (జూబ్లీహిల్స్).
జిల్లాల ఇన్‌చార్జీలు
రాష్ట్ర పార్టీలోని పలువురు నాయకులను ఆయా జిల్లాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. వారు.. జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి (నల్లగొండ), మతిన్ ముజాదుద్దీన్ (మహబూబ్‌నగర్), కె.శివకుమార్ (రంగారెడ్డి), జి.రాంభూపాల్‌రెడ్డి (హైదరాబాద్), కొండా రాఘవరెడ్డి (నిజామాబాద్), నర్ర భిక్షపతి (ఆదిలాబాద్), బి.శ్రీనివాసరావు (కరీంనగర్), వేముల శేఖర్‌రెడ్డి (వరంగల్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (ఖమ్మం), వెల్లాల రామ్మోహన్ (మెదక్).
ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు
గతంలోనే పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించగా, తాజాగా మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మునగాల కళ్యాణిరాజ్ (జనగాం), బి.సంజీవరావు (మెదక్), కొళ్ల యాదయ్య (వికారాబాద్), అతిక్ రెహామాన్ (గద్వాల), వొడ్లోజు వెంకటేష్ (యాదాద్రి).
రాష్ట్ర కమిటీ
పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా జెట్టి రాజశేఖర్, ఇ. అవినాష్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి.వేణుమాధవ్‌రావు, అధికార ప్రతినిధులుగా జె.మహేందర్‌రెడ్డి, మతిన్ ముజాదుద్దీన్, జి.రాంభూపాల్‌రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు.
అధికార ప్రతినిధులు
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జే మహేందర్ రెడ్డి, మతిన్‌ముజాదుద్దీన్, జీ రాంభూపాల్ రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు.
Advertisement
Advertisement