విద్యుదాఘాతానికి యువ రైతు బలి | young farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి యువ రైతు బలి

May 5 2015 3:03 PM | Updated on Sep 3 2017 1:29 AM

ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఓ యువ రైతు మృతి చెందాడు.

సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్ దిమ్మెల వద్ద జరిగింది. వివరాల ప్రకారం..ఇందిరానగర్ గ్రామానికి చెందిన రుద్రారం శంకర్(28) అనే వ్యక్తి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలం దగ్గర మోటర్ వేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement