యువరైతు ఆత్మహత్య | Young Farmer commits Suicide | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Jul 31 2015 6:37 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా బిచ్‌కొండ మండలం శాంతాపూర్ గ్రామంలో జరిగింది.

బిచ్‌కొండ (నిజామాబాద్ జిల్లా) : అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా బిచ్‌కొండ మండలం శాంతాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శాంతాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య(27) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన 4 ఎకరాల పొలంలో సోయా, వరి పంటలను సాగు చేశాడు. అయితే  పంటలు సరిగా పండక పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి.

దీంతో అప్పు తీర్చే మార్గం కనబడక శుక్రవారం పొలం దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి సుమారు రూ. 3లక్షల వరకు అప్పున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement